Romance
Ongoing
రాక్షసుడి ప్రేమ
అదొక పెద్ద భవంతి. ఆ ఇంట్లో పూజ గదిలో అన్నపూర్ణాదేవి దేవుడికి దండం పెట్టుకుంటోంది. అప్పుడే ఒక పనిమనిషి కంగారుగా వచ్చి... "అమ్మా, మీకో ఫోన్ వచ్చింది," అని చెప్పింది.
"నాకా? ఈ సమయంలో ఎవరు చేశారేంటి?" అని ఆవిడ అడిగింది.
"ఏమోనమ్మా, కొత్త నెంబర్ నుంచి వచ్చింది," అని ఫోన్ ఇచ్చింది పనిమనిషి.
"సర్లే," అని చెప్పి ఫోన్ తీసుకుని, "హలో... ఎవరమ్మా?" అని అడిగింది అన్నపూర్ణాదేవి.
ఇటు పక్కనుంచి... "అమ్మా... నేను..." అని ఒక సన్నని గొంతు వణుకుతూ వినిపించింది.