Chapter 03

5 words · 1 min read

తన కళ్లను తనే నమ్మలేకపోతున్నాడు సిద్ధార్థ్. ఆరేళ్ల క్రితం తను ఆ హోటల్ కి వెళ్ళింది నిజమే. ఆ రోజు తన ప్రత్యర్థులు తన డ్రింక్ లో ఏదో పవర్ఫుల్ డ్రగ్ కలిపారు. ఆ మత్తులో, ఆ కామంలో తన ఒంట్లో రక్తం ఉడికిపోయింది. తన గదిలోకి డ్రింక్స్ తీసుకువచ్చిన ఆ వెయిట్రెస్ ని తను అత్యంత క్రూరంగా అనుభవించాడు. ఆ మత్తు దిగేసరికి తెల్లవారింది. లేచి చూసేసరికి గదిలో ఎవరూ లేరు. కేవలం బెడ్ మీద రక్తం మరకలు మాత్రమే ఉన్నాయి. ఆ అమ్మాయి ఎవరో కనుక్కోవాలని అప్పుడు ప్రయత్నించాడు, కానీ అప్పట్లో తన చేతిలో ఇప్పుడున్నంత పవర్ లేదు, పైగా తన ప్రత్యర్థులతో జరిగిన గ్యాంగ్ వార్ లో ఆ విషయం మరుగున పడిపోయింది. కానీ... ఆ రోజు తను నాశనం చేసిన ఆ జీవితం మానసదా? ఆరేళ్లుగా ఒక బిడ్డను మోస్తూ, సమాజం చేత ఛీత్కారాలు పడుతూ, ఒంటరి పోరాటం చేస్తున్న ఆ తల్లికి తనే కారణమా? సిద్ధార్థ్ కు తల పగిలిపోతున్నట్లు ఉంది. రెండు చేతులతో జుట్టు పీక్కుంటూ సోఫాలో కుప్పకూలిపోయాడు. కళ్లలోంచి నీళ్లు ఉబికి వస్తున్నాయి. "నేనా... ఆ పని చేసింది నేనా? ఒక పసికూన లాంటి అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి, ఆమె కడుపులో నా బిడ్డను వదిలేసి... ఆరేళ్ల తర్వాత మళ్లీ నిన్న రాత్రి... అదే అమ్మాయిని ఒక వేశ్యలా నా పడకగదికి రప్పించుకున్నానా? నా బిడ్డ ప్రాణాలు కాపాడుకోవడానికి వచ్చిన నా భార్యను, నేను డబ్బులిచ్చి కొనుక్కున్న ఒక మాంసం ముద్దలా ట్రీట్ చేశానా? నేను మనిషినా, లేక మృగాన్నా?" అంటూ గట్టిగా అరుస్తూ పక్కనే ఉన్న టేబుల్ ని కాలితో తన్నాడు. ఆ దెబ్బకు టేబుల్ మీదున్న అద్దం పగిలి ముక్కలైంది. సంజయ్ కూడా ఈ నిజం తెలిసి షాక్ లో ఉండిపోయాడు. బాస్ కళ్లలో ఎప్పుడూ రక్తం చూశాడు కానీ ఇలా కన్నీళ్లు చూడటం ఇదే తొలిసారి.

అయితే సిద్ధార్థ్ కు ఒక చిన్న అనుమానం. ఆ బిడ్డ నిజంగా తనదేనా? తను కాకుండా ఇంకెవరైనా ఆమె జీవితంలోకి వచ్చారా? ఆమె సింగిల్ మదర్ అని రిపోర్ట్ లో ఉంది. కానీ నూటికి నూరు శాతం నిర్ధారణ చేసుకోవాలి. కళ్లు తుడుచుకుని పైకి లేచాడు. అతని ముఖంలో ఇప్పుడు ఒక భయంకరమైన గంభీరత, ఒక ఆధిపత్యం కనిపిస్తున్నాయి. "సంజయ్... హాస్పిటల్ లో ఉన్న ఆ పిల్లాడి రక్తపు నమూనాలు తీసుకురా. నా DNA తో టెస్ట్ చేయించు. ఈ విషయం ప్రపంచంలో మూడో కంటికి తెలియకూడదు. నాకు రిజల్ట్ కేవలం మూడు గంటల్లో నా టేబుల్ మీద ఉండాలి. వెళ్లు!" అని ఆజ్ఞాపించాడు. సంజయ్ వెంటనే అక్కడినుంచి వెళ్ళిపోయాడు. ఈ మూడు గంటలు సిద్ధార్థ్ కి మూడు యుగాల్లా గడిచాయి. కళ్లు మూసుకుంటే చాలు... నిన్న రాత్రి తన కింద నలిగిపోతూ మానస పడ్డ నరకం గుర్తొస్తోంది. తను ఆమె పెదాలను కొరుకుతూ రక్తం తెప్పిస్తుంటే, ఆమె ఎంతలా ఏడ్చింది! ఆమె సున్నితమైన దేహం మీద తన గోళ్ళతో చేసిన గాయాలు... ఛీ, ఒక భర్త తన భార్యను ఎంత ప్రేమగా చూసుకోవాలి? కానీ తను ఆమెను అనుభవించిన తీరు ఒక మృగానికంటే హీనం. 'నిన్ను నేను వదలను మానసా... నా వల్ల నువ్వు పడ్డ ప్రతి కన్నీటి బొట్టుకి నేను సమాధానం చెప్తాను. నిన్ను మహారాణిలా చూసుకుంటాను,' అని మనసులోనే గట్టిగా ప్రమాణం చేసుకున్నాడు.

సరిగ్గా మూడు గంటల తర్వాత సంజయ్ ఒక సీల్డ్ కవర్ తో గదిలోకి వచ్చాడు. ఆ కవర్ ని సిద్ధార్థ్ చేతికి ఇస్తూ, "సార్... రిపోర్ట్ పాజిటివ్. ఆ పిల్లాడు మీ నూటికి నూరు శాతం మీ రక్తమే. శివ బాబు మీ కొడుకే సార్," అని చెప్పాడు. ఆ మాట వినగానే సిద్ధార్థ్ కు తెలియని ఒక ఆనందం, ఒక భావోద్వేగం. "నా కొడుకు... నా రక్తం..." అని ఆ రిపోర్ట్ ని గుండెలకు హత్తుకున్నాడు. ఆ డాన్ కళ్లలో తండ్రి ప్రేమ ఉప్పొంగింది. "కానీ సార్... మీరు ఈ నిజం మ్యామ్ కి ఎప్పుడు చెప్తారు? ఆమె మీ బిడ్డకే జన్మనిచ్చింది. మీరు ఆమెను తీసుకురావాలి కదా?" అని అడిగాడు సంజయ్. సిద్ధార్థ్ ముఖంలో బాధ ముంచుకొచ్చింది. "లేడు సంజయ్. ఇప్పుడు నేను వెళ్లి నేనే ఆ రాక్షసుడ్ని అని చెబితే ఆమె తట్టుకోలేదు. ఆరేళ్లుగా నన్ను మనస్ఫూర్తిగా అసహ్యించుకుంటోంది. నిన్న రాత్రి కూడా నన్ను ఒక నీచుడిగా, మృగంగా చూసింది. ఇప్పుడు నేను వెళ్లి ఈ నిజం చెబితే, నా కొడుకుని తీసుకుని నాకెన్నటికీ దొరక్కుండా ఎక్కడికైనా వెళ్లిపోతుంది. ఆమెకు నా మీద ప్రేమ కలగాలి... కనీసం నమ్మకం కలగాలి. అప్పటిదాకా ఈ నిజం నా గుండెల్లోనే దాచుకుంటాను. ముందు నా కొడుకు ఆపరేషన్ సక్సెస్ అవ్వాలి. ఆ తర్వాత వాళ్ళిద్దరినీ నా ఇంటికి ఎలా తీసుకురావాలో నాకు తెలుసు," అని ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చాడు సిద్ధార్థ్.

మరుసటి రోజు ఉదయం. సిటీ హాస్పిటల్ లో మానస కొడుకు సర్జరీ కోసం ఎదురుచూస్తోంది. డాక్టర్ ఆమె దగ్గరికి వచ్చి ఒక కవర్ ఇచ్చాడు. అందులో డెబ్భై ఐదు లక్షల చెక్ ఉంది. "ఇదేంటి డాక్టర్?" అని మానస ఆశ్చర్యంగా అడిగింది. "మానస గారు, రాత్రికి రాత్రే ఒక పెద్ద చారిటీ ట్రస్ట్ వాళ్ళు మీ బాబు సర్జరీకి అయ్యే ఖర్చు మొత్తం వాళ్లే భరిస్తామని చెప్పారు. మీరు కట్టిన డబ్బు మీకు తిరిగి ఇచ్చేస్తున్నాం. మీరు ఎలాంటి టెన్షన్ పడకండి, అన్నీ ఆ ట్రస్ట్ వాళ్లే చూసుకుంటారు," 

అని అబద్ధం చెప్పాడు డాక్టర్. సిద్ధార్థ్ ఆసుపత్రి మేనేజ్మెంట్ ని బెదిరించి ఈ నాటకం ఆడించాడని ఆమెకు తెలియదు. తన కొడుకు ప్రాణాలు దక్కాయి, పైగా తాను అమ్ముకున్నందుకు వచ్చిన ఆ పాపపు డబ్బు తన కొడుకుకు అవసరం రాలేదు. ఆ డబ్బును తిరిగి ఆ మృగాడి మొహాన కొట్టి రావచ్చని ఆమెకు ఎక్కడలేని సంతోషం వేసింది. 

డాక్టర్స్ శివకు సర్జరీ మొదలుపెట్టారు. అడ్వాన్స్డ్ సెల్యులార్ థెరపీ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అయింది. శివ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఆ క్షణం మానస సంతోషానికి అవధులు లేవు.

ఒక నెల రోజులు ఇట్టే గడిచిపోయాయి. ఈ నెల రోజులూ మానస ఆసుపత్రిలోనే శివ పక్కనే ఉంది. కానీ ఆమెకు తెలియని విషయం ఏంటంటే, ఆమెకు అడుగడుగునా రక్షణగా సిద్ధార్థ్ ఉన్నాడు. ప్రతి రాత్రి ఆమె నిద్రపోయిన తర్వాత, ఆసుపత్రి ఐసీయూ అద్దాల కిటికీ బయట నిలబడి గంటల తరబడి ఆమెనే చూసేవాడు సిద్ధార్థ్. ఆమె ముఖం మీద పడిన వెంట్రుకలను తన చూపులతోనే సరిచేసేవాడు. ఆమె నిద్రలో కదిలితే తన బిడ్డను హత్తుకుని పడుకుంటున్న తీరు చూసి మురిసిపోయేవాడు. హాస్పిటల్ క్యాంటీన్ నుంచి ఆమెకు ఇష్టమైన భోజనం వచ్చేలా చేసేవాడు. ఆమె వేసుకోవడానికి మంచి బట్టలు ఏవో ఒక వంకతో ఆమెకు చేరేలా చేసేవాడు. ఇదంతా ఎవరో చేస్తున్నారని మానసకు అనుమానం వస్తున్నా, తన కొడుకు కోలుకుంటున్న ఆనందంలో వాటిని పెద్దగా పట్టించుకోలేదు. ఒక నెల తర్వాత డాక్టర్లు శివను డిశ్చార్జ్ చేశారు. ఇప్పుడు శివ పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడు. అయితే ఇంటికి వెళ్లే ముందు మానస ఒక ముఖ్యమైన పని చేయాలనుకుంది. తన దగ్గర ఉన్న ఆ డెబ్భై ఐదు లక్షల డబ్బును ఆ మాఫియా డాన్ కి తిరిగి ఇచ్చేయాలి. ఆ రోజు రాత్రి తను పడ్డ నరకానికి ఆ డబ్బు ఒక గుర్తు. ఆ డబ్బు తన దగ్గర ఉన్నంతకాలం తను ఒక అమ్ముడుపోయిన వస్తువు లాగానే ఫీల్ అవుతుంది. "నేను నా బిడ్డ కోసం ఆ రాత్రి నీ దగ్గరకు వచ్చాను కానీ, నేను అమ్ముడుపోయే దాన్ని కాదు," అని అతని ముఖం మీద చెప్పి ఆ డబ్బు ఇచ్చేయాలి అనుకుంది.

ఆ రోజు ఉదయం పది గంటలు అవుతోంది. సిద్ధార్థ్ తన ఇంట్లో, తన జిమ్ లో వర్కవుట్ చేస్తున్నాడు. అతనికి కోపం వచ్చినప్పుడల్లా బాక్సింగ్ బ్యాగ్ ని ఎంత గట్టిగా కొడతాడో, మానస మీద ప్రేమ వచ్చినప్పుడు కూడా అంతే గట్టిగా వర్కవుట్ చేస్తాడు. అతని కండరాల మీద నుంచి చెమట ధారగా కారుతోంది. అప్పుడే అతని సెక్యూరిటీ గార్డ్ కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. "సార్... బయట ఎవరో ఒక అమ్మాయి వచ్చింది. ఆమె పేరు మానస అట. మిమ్మల్ని కలవాలని పొద్దున్నుంచి గేటు బయటే నిలబడి ఉంది సార్. అపాయింట్మెంట్ లేదని లోపలికి పంపలేదు. కానీ ఆమె అక్కడినుంచి కదలడం లేదు," అని చెప్పాడు. ఆ మాట వినగానే సిద్ధార్థ్ చేతిలో ఉన్న బాక్సింగ్ గ్లోవ్స్ కింద పడిపోయాయి. 'మానస వచ్చిందా? నా ఇంటికి వచ్చిందా? పొద్దున్నుంచి బయటే ఉందా? ఈ సెక్యూరిటీ గార్డ్ నా పెళ్లాన్ని బయట నిలబెడతాడా?' కోపంతో రగిలిపోయిన సిద్ధార్థ్ వెంటనే ఒక టవల్ తో ముఖం తుడుచుకుని వేగంగా బయటకు నడిచాడు.

బయట సూర్యుడు మండిపోతున్నాడు. ఆ ఎండలో గేటు ముందు ఒక చిన్న బ్యాగ్ పట్టుకుని నిలబడి ఉంది మానస. ఆమె ముఖం ఎర్రగా కందిపోయింది. ఆమెను అలా చూడగానే సిద్ధార్థ్ గుండెలో ఏదో తెలియని బాధ. వేగంగా గేటు తీసుకుని బయటకు వచ్చాడు. అతన్ని చూడగానే మానస కళ్లలో ఒక రకమైన భయం, అదే సమయంలో ఒక మొండి ధైర్యం కనిపించాయి. ఆమె అతని వైపు రాబోతుంటే, సిద్ధార్థ్ కోపంగా సెక్యూరిటీ గార్డ్ వైపు తిరిగి, "ఎంత ధైర్యం రా నీకు? ఆమెను బయట నిలబెడతావా? ఆమె ఎవరో తెలుసా నీకు..." అని అరిచేలోపే తనని తాను కంట్రోల్ చేసుకున్నాడు. మానస అతని ముందుకు వచ్చి నిలబడింది. "సార్... నేను ఆ రోజు రాత్రి..." అంటూ ఆమె తడబడుతుంటే, సిద్ధార్థ్ ఆమె కళ్లలోకి సూటిగా చూశాడు. ఆ చూపుల్లో క్రూరత్వం లేదు, ఆకలి లేదు... కేవలం ఒక ఆరాధన ఉంది. కానీ అది మానసకు అర్థం కాలేదు. "నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలుసు. ముందు లోపలికి రా," అని ఒక అధికారికమైన గొంతుతో అన్నాడు. "లేదు సార్, నేను లోపలికి రాను. నాకు ఈ డబ్బు అవసరం రాలేదు. నా కొడుకు ఆపరేషన్ కి ఎవరో సాయం చేశారు. ఈ డెబ్భై ఐదు లక్షలు మీకు ఇచ్చేయడానికే వచ్చాను. ఇదిగోండి మీ డబ్బు," అంటూ ఆ బ్యాగ్ ని అతని ముందుకు చాపింది. సిద్ధార్థ్ ఆ బ్యాగ్ ని తీసుకోకుండా ఆమె చేతులనే చూస్తున్నాడు. "నాకు అమ్ముడుపోవడం ఇష్టం లేదు సార్. ఆ రోజు నా అవసరం నన్ను మీ దగ్గరికి తెచ్చింది. కానీ నేను వేశ్యను కాను," అని చాలా దృఢంగా, ఏడుపును దిగమింగుకుంటూ చెప్పింది మానస. ఆ మాటలు సిద్ధార్థ్ గుండెను కోసేశాయి. తను ఆమెను ఎంత బాధపెట్టాడో అతనికి అర్థమైంది. కానీ ఇప్పుడు ఆమెను వదిలే ప్రసక్తే లేదు. 

"ఈ డబ్బు నీదే. ఆ రాత్రి నువ్వు పడ్డ నరకానికి ఇది ఒక చిన్న పరిహారం. కానీ... నువ్వు ఇప్పుడు ఇక్కడినుంచి ఎక్కడికీ వెళ్లడం లేదు. ఇకపై నువ్వు ఈ ఇంట్లోనే ఉంటావు," అని అత్యంత కఠినంగా, ఎవరూ ఎదురు చెప్పలేని గొంతుతో ఒక ఆర్డర్ వేసినట్టుగా చెప్పాడు సిద్ధార్థ్. ఆ మాట వినగానే మానస కళ్లు భయంతో పెద్దవయ్యాయి. "ఏంటి మీరు అనేది? నేను ఇక్కడ ఎందుకు ఉంటాను? ఆ రోజు మీ కోరిక తీరింది కదా, ఇంక నన్ను వదిలేయండి," అని వణుకుతూ వెనక్కి అడుగు వేసింది. "ఇది రిక్వెస్ట్ కాదు మానస, వార్నింగ్. మీ అబ్బాయి, శివ కూడా ఈ ఇంటికే రాబోతున్నాడు. ఇంక ముందు మీ ఇద్దరి బాధ్యత నాది," అంటూ ఆమె చేతిని గట్టిగా పట్టుకుని తన వైపు లాక్కున్నాడు సిద్ధార్థ్. అతని పట్టులో ఒక ఆధిపత్యం ఉంది. ఆమె ఎంత విడిపించుకోవాలని చూసినా అతని బలం ముందు ఆమె ఏమీ చేయలేకపోయింది. ఒక మాఫియా డాన్ చేతిలో తన జీవితం ఇంకెంత బలికాబోతోందో అని భయంతో వణికిపోతోంది మానస. 

సిద్ధార్థ్ చేతిలో బందీగా ఆ పెద్ద బంగ్లా లోపలికి అడుగుపెడుతున్న మానసకు ఆ ఇల్లు ఒక అందమైన జైలులా అనిపించింది. ఆ గేట్లు మూసుకున్న శబ్దం ఆమె గుండెల్లో ఏదో తెలియని భయాన్ని రేపింది. లోపలంతా చాలా విశాలంగా, ఎంతో ఖరీదైన వస్తువులతో నిండి ఉంది. కానీ మానసకు అవన్నీ పట్టలేదు. ఆమె కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. తను ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఆ డబ్బు అతనికి ఇచ్చేసి తన కొడుకుతో కలిసి ఎక్కడికైనా వెళ్లిపోయి ప్రశాంతంగా బతుకుదాం అనుకుంది. కానీ ఇప్పుడు ఈ రాక్షసుడి చేతిలో మళ్ళీ చిక్కుకుపోయింది. "నన్ను వదిలేయండి... నేను ఇక్కడ ఉండలేను. మీరు ఆ రోజు రాత్రి నన్ను వదిలేస్తానన్నారు కదా, మళ్ళీ ఇప్పుడెందుకు నన్ను ఇక్కడ బంధిస్తున్నారు?" అని ఏడుస్తూ అడిగింది మానస. సిద్ధార్థ్ ఆమె మాటలు ఏమీ పట్టించుకోలేదు. ఆమెను అలాగే లాక్కుంటూ వెళ్లి హాల్ మధ్యలో ఉన్న సోఫాలో కూర్చోబెట్టాడు. "నువ్వు ఇంక ఏడవద్దు. ఇక్కడినుంచి నువ్వు బయటికి వెళ్లే ప్రసక్తే లేదు," అని చాలా కఠినంగా చెప్పాడు. ఆ మాటలకి ఆమెకు ఇంకా భయం వేసింది. అతనొక మాఫియా డాన్ అని ఆమెకు తెలుసు, అతని మాట కాదంటే ఏం చేస్తాడో అన్న భయం ఆమెను వణికిస్తోంది. అప్పుడే బయట ఒక కారు వచ్చి ఆగింది. అందులోంచి సంజయ్, మానస కొడుకు శివను ఎత్తుకుని లోపలికి వచ్చాడు. శివను చూడగానే మానస కళ్లలో కాస్త ప్రాణం వచ్చినట్లు అయింది. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి తన కొడుకుని గట్టిగా హత్తుకుని ఏడ్చేసింది.

Comments