సిద్ధార్థ్ ఆ కాగితాలను చూసి ఒక్కక్షణం షాక్ అయ్యాడు. తను ఎప్పటినుంచో భయపడుతున్న క్షణం వచ్చేసిందని అతనికి అర్థమైంది. మానస కోపంగా ఊగిపోతూ, "ఏంటిది? ఈ రిపోర్ట్ ఏంటి? నా కొడుక్కి నువ్వు తండ్రివి ఎలా అయ్యావు? చెప్పు... ఆరేళ్ల క్రితం ఆ హోటల్ గదిలో నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వేనా? ఆ చీకట్లో నా మీద పడి ఒక జంతువులా ప్రవర్తించింది నువ్వేనా?" అని గొంతు చించుకుని అరిచింది. సిద్ధార్థ్ తల దించుకున్నాడు. అతని మౌనమే ఆమె ప్రశ్నలకు సమాధానం అని అర్థమైపోయింది మానసకు. ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూ, "ఛీ... నువ్వు మనిషివేనా? ఒక పసిపిల్లలాంటి దాన్ని నాశనం చేసి, నా కడుపులో నీ బిడ్డను వదిలేసి వెళ్లిపోయావు. ఆరేళ్లు నేను సమాజంలో ఎన్ని ఛీత్కారాలు పడ్డానో తెలుసా? నా సొంత ఇంట్లో వాళ్లే నన్ను వేశ్యగా చూశారు. ఒక్కొక్క పూట తిండి కోసం నా బిడ్డను పట్టుకుని నేను పడ్డ నరకం నీకేం తెలుసురా మృగమా!" అని అతని ఛాతీ మీద పిడికిలితో కొట్టడం స్టార్ట్ చేసింది. సిద్ధార్థ్ ఆమెను ఆపలేదు. ఆమె ఎంత కొడితే అంత శాంతిస్తోందని, తను చేసిన తప్పుకు ఇదే సరైన శిక్ష అని అతను మౌనంగా భరిస్తున్నాడు.
"కానీ... నాకు అర్థం కానిది ఒక్కటే. ఆ రోజు రాత్రి నన్ను హాస్పిటల్ కి డబ్బు కోసం రవి నీ దగ్గరకు తీసుకొచ్చాడు కదా... అప్పుడు నీకు తెలుసా నేను ఎవరో? నా కడుపులో ఉన్నది నీ బిడ్డే అని నీకు తెలుసా?" అని అడిగింది మానస కన్నీళ్లు తుడుచుకుంటూ. సిద్ధార్థ్ మెల్లగా తలెత్తి ఆమె కళ్లలోకి చూస్తూ, "లేదు మానసా... నాకు ఆ రోజు రాత్రి నీ గురించి ఏమీ తెలియదు. నా ప్రత్యర్థులు నా డ్రింక్ లో డ్రగ్స్ కలిపారు, ఆ మత్తులో నేను ఏం చేస్తున్నానో నాకే తెలియలేదు. నిన్నటి దాకా నువ్వంటే నాకు ఒక ఇష్టం, ఒక ఆకర్షణ మాత్రమే. కానీ నువ్వు ఆ డబ్బు తిరిగి ఇచ్చేయడానికి ఈ ఇంటికి వచ్చిన రోజు, నా మనుషులు ఇచ్చిన ఫైల్ లో ఆ సీసీటీవీ ఫుటేజ్ చూసి నేను షాక్ అయ్యాను. ఆ రోజు నీ జీవితాన్ని నాశనం చేసింది నేనే అని తెలిశాకే ఈ డీఎన్ఏ టెస్ట్ చేయించాను," అని భారంగా చెప్పాడు సిద్ధార్థ్.
ఆ మాటలు వినగానే మానస కళ్లలో అసహ్యం ఇంకా పెరిగింది. "అంటే... ఆ రోజు రాత్రి నేను డబ్బు కోసం నీ గదిలోకి వచ్చినప్పుడు కూడా, నువ్వు నన్ను వదిలిపెట్టలేదు. నీ కడుపున పుట్టిన బిడ్డ ప్రాణం కోసం వస్తే... ఆ బిడ్డ తల్లిని, ఆ బిడ్డ ప్రాణానికి వెలకట్టి నన్ను నీ పడకగదిలో ఒక వేశ్యలా వాడుకున్నావు. ఛీ... నిన్ను చూస్తుంటే నాకు అసహ్యంగా ఉంది. నా బిడ్డ కోసం, నా ప్రాణమైనా ఇస్తాను కానీ, నీలాంటి మృగం తో ఒక్కక్షణం కూడా కలిసి ఉండలేను. ఈ క్షణమే నా కొడుకుని తీసుకుని నేను వెళ్లిపోతాను. నీ నీడ కూడా నా మీద పడటానికి వీల్లేదు," అంటూ వెనుదిరిగి గబగబా తన గది వైపు నడిచింది మానస. సిద్ధార్థ్ గుండె ఆగిపోయినంత పనైంది. తను భయపడినట్టే జరుగుతోంది. ఆమె తనను వదిలివెళ్ళిపోతోంది. వెంటనే పరుగెత్తుకుంటూ వెళ్లి ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. "వదులు రాక్షసుడా! నా చెయ్యి పట్టుకునే అర్హత నీకు లేదు," అని గట్టిగా అరిచింది మానస.
"లేదు మానసా... నువ్వు ఎక్కడికీ వెళ్లడానికి వీల్లేదు. నువ్వు నా భార్యవి. శివ నా కొడుకు. నేను చేసిన తప్పుకు ప్రాణం ఇచ్చైనా ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, కానీ నిన్ను, నా కొడుకుని వదిలి నేను బతకలేను," అని ఆమెను తన గుండెలకి హత్తుకున్నాడు సిద్ధార్థ్. మానస అతని కౌగిలిలోంచి విడిపించుకోవడానికి సర్వశక్తులూ ఒడ్డుతోంది. "వదలండి నన్ను... మీరు నన్ను ప్రేమించట్లేదు, నా కొడుకుని ప్రేమించట్లేదు. మీరొక శాడిస్ట్ ని. ఆ రోజు హోటల్ లో బలవంతం చేశారు. మొన్న డబ్బు కోసం నా శరీరాన్ని వాడుకున్నారు. నిన్న బలవంతంగా పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు నా కొడుకు మీద మీకు హక్కు ఉందని నన్ను బంధిస్తున్నారు. ఇది ప్రేమ కాదు, ఇది మీ పైశాచికత్వం. నన్ను వదిలేయండి!" అని ఏడుస్తూ కేకలు వేసింది. ఆమె మాటలు సిద్ధార్థ్ కి సూదుల్లా గుచ్చుకుంటున్నాయి. నిజమే తను ఆమెతో ప్రతిసారీ బలవంతమే చేశాడు. కానీ ఆమె లేకుండా తను బతకలేడు అన్నది కూడా అంతే నిజం. ఆమెను ఒక్కసారిగా ఎత్తి, తన బెడ్ రూమ్ లోకి తీసుకెళ్లి మంచం మీద పడేశాడు. "నువ్వు ఏమనుకున్నా సరే, నేను మృగాన్నే అనుకో, రాక్షసుడినే అనుకో. కానీ ఈ గది దాటి బయటకు వెళ్లే ప్రసక్తే లేదు," అంటూ గది తలుపులు బయట నుంచి లాక్ చేసి వెళ్లిపోయాడు సిద్ధార్థ్.
ఆ పెద్ద గదిలో ఒంటరిగా మిగిలిపోయింది మానస. ఆమె ఏడుపు ఆ గది గోడలకు తగిలి ప్రతిధ్వనిస్తోంది. తన జీవితం ఎందుకిలా తయారైంది? తను ఎవరినైతే ద్వేషించిందో, ఎవరినైతే చంపేయాలని కోరుకుందో... అతనే తన భర్తగా తన ముందు నిలబడ్డాడు. తన కొడుకుకి తండ్రి అని హక్కు చూపిస్తున్నాడు. ఇప్పుడు ఆమె ముందు దారులు మూసుకుపోయాయి. ఒకవైపు తన ప్రాణమైన కొడుకు, వాడికి తండ్రి ప్రేమ కావాలి. మరోవైపు తనను ప్రతిసారీ మానసికంగా, శారీరకంగా గాయపరిచిన ఒక రాక్షసుడు. ఈ బంధం నుంచి బయటపడటం ఎలా? ఈ నరకంలో ఇంకెన్నాళ్ళు బతకాలి? ఈ ప్రశ్నలు ఆమె మెదడును తొలిచేస్తున్నాయి. మరోవైపు సిద్ధార్థ్ పరిస్థితి కూడా దారుణంగా ఉంది. అతను తన స్టడీ రూమ్ లో కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. సిటీ మొత్తాన్ని గడగడలాడించే ఆ మాఫియా డాన్, తన భార్య ప్రేమ కోసం బిచ్చగాడిలా ఎదురుచూస్తున్నాడు.
సంజయ్ కి సిద్ధార్థ్ అంటే ఒక బాస్ గానే కాదు, దేవుడిగా కూడా గౌరవం. ఆ బంగ్లాలో పనివాళ్లందరికీ సిద్ధార్థ్ ఒక భయంకరమైన మాఫియా డాన్. కానీ గత రెండు రోజులుగా వాళ్లందరూ చూస్తున్నది వేరు. సింహం లాంటి సిద్ధార్థ్, ఇప్పుడు పంజరంలో చిక్కుకున్నట్లు గదిలోంచి బయటకు రావడం లేదు. మానసకు నిజం తెలిసినప్పటి నుంచి బంగ్లాలో వాతావరణం నిశ్శబ్దంగా, గంభీరంగా మారిపోయింది. మానస తన గదికే పరిమితమైంది. శివతో మాట్లాడటం లేదు, అన్నం తినడం లేదు. కేవలం శూన్యంలోకి చూస్తూ కూర్చుంటోంది. సిద్ధార్థ్ ఆమె గదికి వెళ్దామంటే, ఆమె చూపులు తనను ఎక్కడ దహించివేస్తాయో అన్న భయంతో వెనకడుగు వేస్తున్నాడు. తాను చేసిన తప్పును ఆమె ఎలాగైనా క్షమించేలా చేయాలని అతను ఆలోచిస్తున్నాడు. కానీ ఆమెకు తనంటే ఉన్నది కోపం కాదు, అసహ్యం అని అతనికి అర్థమైంది.
మూడో రోజు ఉదయం. సిద్ధార్థ్ కిందికి వచ్చాడు. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి, రాత్రి నిద్రపోలేదని స్పష్టంగా తెలుస్తోంది. సంజయ్ దగ్గరికి వచ్చి, "మానస ఏమైనా తిన్నదా?" అని అడిగాడు. "లేదు సార్. రెండు రోజుల నుంచి మంచినీళ్లు తప్ప ఏమీ తీసుకోలేదు. శివ బాబు కూడా వాళ్ళ అమ్మ ఎందుకు తనతో మాట్లాడటం లేదని అడుగుతున్నాడు," అని బాధగా చెప్పాడు సంజయ్. ఆ మాట వినగానే సిద్ధార్థ్ కు కోపం, బాధ రెండు ముంచుకొచ్చాయి. ఒక ప్లేట్ లో ఫుడ్ పెట్టుకుని మానస గదికి వెళ్ళాడు. తలుపు తీసి లోపలికి అడుగుపెట్టాడు. మానస మంచం మీద ముడుచుకుని పడుకుని ఉంది. ఆమె కళ్లు వాచిపోయాయి. అతను అడుగుల చప్పుడు విని ఆమె లేచి కూర్చుంది. అతన్ని చూడగానే ఆమె కళ్లలో మళ్లీ అదే కోపం. "ఎందుకు వచ్చావు ఇక్కడికి? నన్ను చంపడానికా?" అని అడిగింది. సిద్ధార్థ్ మౌనంగా ప్లేట్ ని ఆమె ముందు పెట్టి, "ముందు ఇది తిను. రెండు రోజుల నుంచి ఏమీ తినలేదట. నీకేమైనా అయితే నేను తట్టుకోలేను," అన్నాడు.
మానస ఆ ప్లేట్ ని విసిరికొట్టింది. అది గోడకు తగిలి ముక్కలైంది. "నీకు నా మీద ప్రేమ ఉన్నట్లు నటించకు! నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వు. నాకు నా కొడుకే సర్వస్వం అనుకుంటే, వాడిని కూడా నాకు దూరం చేశావు. నన్ను ఒక వేశ్యలా ట్రీట్ చేశావు. ఇప్పుడు ఇదంతా దేనికి? నా మీద జాలి చూపిస్తున్నావా? లేక ఇంకొకసారి నన్ను అవమానించడానికా?" అని అరిచింది. సిద్ధార్థ్ కోపాన్ని అణుచుకుని, "నేను నిన్ను అవమానించడం లేదు మానసా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా తప్పు తెలుసుకున్నాను. నీకు నా మీద కోపం ఉంటే నన్ను కొట్టు, తిట్టు, కానీ ఇలా నిన్ను నువ్వు హింసించుకోకు," అన్నాడు దయనీయంగా.
"ప్రేమా? నీకు ప్రేమ అంటే ఏంటో తెలుసా? ప్రేమ అంటే ఒకరినొకరు గౌరవించుకోవడం. కానీ నువ్వు నన్ను ఎప్పుడూ ఒక వస్తువులా చూశావు. నీకు అవసరమైనప్పుడు వాడుకున్నావు, ఇప్పుడు వదిలేయకుండా పంజరంలో బంధించావు. నువ్వు రాక్షసుడివి సిద్ధార్థ్. నాకిక్కడ ఉండటం ఇష్టం లేదు. నన్ను నా కొడుకుని పంపించేయ్," అని ఏడుస్తూ బతిమాలింది మానస. "పంపించేయడానికి నేను నిన్ను తీసుకురాలేదు మానస. నువ్వు నా భార్యవి. మన కొడుకుకి తండ్రిని నేను. నేను మిమ్మల్ని వదిలి ఉండలేను. ఈ నిజం నువ్వు జీర్ణించుకోవడానికి టైం పడుతుంది, కానీ నువ్వు నా దానవే," అని గట్టిగా చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోయాడు.
ఆ రోజు రాత్రి. సిద్ధార్థ్ తన స్టడీ రూమ్ లో కూర్చుని మందు తాగుతున్నాడు. అతనికి అర్థం కావడం లేదు, మానస ప్రేమను ఎలా గెలుచుకోవాలో. తాను చేసిన తప్పును క్షమించే అంత పెద్ద మనసు ఆమెకు ఉందో లేదో అతనికి తెలియదు. అప్పుడే సంజయ్ వచ్చాడు. "సార్, కింద మానస మ్యామ్ బయటకు వెళ్తాను అంటున్నారు. సెక్యూరిటీ వాళ్ళు ఆపితే వాళ్ళతో గొడవ పడుతున్నారు," అని చెప్పాడు. సిద్ధార్థ్ వెంటనే కిందికి పరిగెత్తాడు. మానస గేటు దగ్గర ఒక చిన్న బ్యాగ్ తో నిలబడి ఉంది. సెక్యూరిటీ గార్డ్స్ ఆమెను ఆపుతున్నారు. "వదలండి నన్ను! నేను ఇక్కడ ఉండలేను," అని ఆమె అరుస్తోంది. సిద్ధార్థ్ అక్కడికి వెళ్లి గార్డ్స్ ని పక్కకు పంపించాడు. "ఎక్కడికి వెళ్తున్నావు మానసా? ఇంత రాత్రి పూట ఎక్కడికి వెళ్తావు?" అని కోపంగా అడిగాడు.
"నీకు అనవసరం! నేను ఎక్కడికైనా వెళ్తాను, రోడ్డు మీద అడుక్కుని బతుకుతాను కానీ నీ నీడలో మాత్రం బతకలేను," అని దృఢంగా చెప్పింది మానస. "నీకు ఎందుకంత పొగరు? నేను నా తప్పు ఒప్పుకుంటున్నాను కదా. నీకు ఏం కావాలి? డబ్బులు కావాలా? ఆస్తి కావాలా? నా ప్రాణం కావాలా? ఏది అడిగినా ఇస్తాను. కానీ నన్ను వదిలి వెళ్తాను అనకు," అన్నాడు సిద్ధార్థ్. "నాకు నీ డబ్బూ వద్దు, నీ ఆస్తి వద్దు. నాకు నా స్వేచ్ఛ కావాలి. నా కొడుకుని నాకు అప్పగించు, మేము వెళ్లిపోతాం," అంది మానస. "శివ నా కొడుకు కూడా! వాడిని నా నుంచి ఎవరూ దూరం చేయలేరు, కనీసం నువ్వు కూడా. లోపలికి నడువు!" అని ఆమె చేతిని గట్టిగా పట్టుకుని లాక్కుంటూ లోపలికి తీసుకెళ్లాడు. ఆమె ఎంతు గింజుకున్నా అతను వదల్లేదు. ఆమెను మళ్ళీ గదిలో బంధించాడు.
మరుసటి రోజు. మానస గదిలో ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ మృగం తనని వదిలిపెట్టడు. ఇక్కడినుంచి పారిపోవాలంటే ఏదో ఒక మార్గం వెతకాలి. అప్పుడే ఆమెకు ఒక ఐడియా వచ్చింది. సిద్ధార్థ్ బయటకు వెళ్ళినప్పుడు, సంజయ్ దగ్గరికి వెళ్లి ఒక మాట అడిగింది. "సంజయ్, నాకో చిన్న హెల్ప్ కావాలి. నేను ఈ ఇంట్లో ఒక ఖైదీలా బతుకుతున్నాను. దయచేసి నన్ను బయటకు వెళ్లనివ్వు. శివని నేను తీసుకువెళ్తాను. మీరు ఆయనకు ఏమీ చెప్పకండి," అని బతిమాలింది. సంజయ్ షాక్ అయ్యాడు. "మ్యామ్, మీరు ఏమడుగుతున్నారో అర్థమవుతోందా? బాస్ కి తెలిస్తే నన్ను చంపేస్తాడు. ఆయనకు మీరు, శివ బాబు అంటే ప్రాణం. దయచేసి ఇలాంటి పనులు చేయకండి," అన్నాడు. "ప్రాణమా? ఆయనకు ఉన్నది ఆధిపత్యం మాత్రమే. ప్లీజ్ సంజయ్, నా పరిస్థితి అర్థం చేసుకో," అని బతిమాలినా సంజయ్ ఒప్పుకోలేదు.
Comments